దూల్మిట్ట (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 12
మండలంలోని బైరాన్ పల్లి గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనరేట్ రష్మీ పెరుమాళ్, ఏసీపీ సదానందం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామానికి సీసీ కెమెరాలు రక్షణ కవచంలా పనిచేస్తూ నేరాలకు తావులేకుండా చేస్తాయని, ప్రతి గ్రామంలోనూ వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొబైల్లో వచ్చే అనుమానాస్పద లింకులను తెరవవద్దని, వాటి ద్వారా డబ్బులు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఒకవేళ అలాంటి మోసాలు జరిగితే వెంటనే పోలీస్ శాఖను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మాటలను నమ్మవద్దని మరోసారి గుర్తు చేశారు. గ్రామంలోకి వచ్చి కొత్త నగలు చేస్తామని చెప్పేవారిని నమ్మవద్దని, మాయమాటలు చెప్పి మోసగిస్తారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేష్, మద్దూరు ఎస్సై ఆసిఫ్, కొమురవెల్లి ఎస్సై మహేష్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచులు, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






