జిల్లా ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలపేట గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బాలపేట గ్రామ శివారులోని ఖాళీ ప్రదేశంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ సీఐ ఉదయ్ కుమార్, ఎస్సై శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.
ఈ దాడి వివరాలను టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ వెల్లడించారు. దాడిలో ఎస్.కె. రఫీ, షేక్ హుసేన్, మొగిలి ఉపేందర్, మద్దనపు సత్యనారాయణ, లకావత్ బాలు అనే ఐదుగురిని అదుపులోకి తీసుకుని అర్బన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి రూ.10,400 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
అయితే, జరాల రమేష్, చల్ల అశోక్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దాడి సమయంలో పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.












