కొమరం భీమ్ ఆసిఫాబాద్, 12 November
కొత్తగా మంజూరైన 407 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి చేతుల మీదుగా అందజేత
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పింఛన్ పథకం కేరమేరీ మండలంలో కొత్తగా మంజూరు చేసిన 407 మంది లబ్ధిదారులకు ఉత్తర్వులు పంపిణీ చేయనున్నట్లు కేరమేరీ ఎంపీడీఓ సాయిరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కేస్లగూడలోని రైతు వేదిక నందు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు.
ముఖ్య అతిథులు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ అనిల్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ హాజరుకానున్నారు.
లబ్ధిదారులు, మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ కోరారు.






