ఖమ్మం, 13 November
ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్, సర్వీస్ సమస్యల సత్వర పరిష్కారానికి జిల్లాల వ్యాప్తంగా ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు అకౌంటెంట్ జనరల్ వి.ఎం.వి. నావల్ కిషోర్ తెలిపారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పెన్షన్, జీపీఎఫ్ అదాలత్, వర్క్‌షాప్‌ను ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నిర్వహించింది.
ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్, సర్వీస్ సమస్యల సత్వర పరిష్కారానికి జిల్లాల వ్యాప్తంగా ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు అకౌంటెంట్ జనరల్ వి.ఎం.వి. నావల్ కిషోర్ తెలిపారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పెన్షన్, జీపీఎఫ్ అదాలత్, వర్క్‌షాప్‌ను ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏజీ నావల్ కిషోర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
రికార్డులు కీలకం
ఈ సందర్భంగా ఏజీ నావల్ కిషోర్ మాట్లాడుతూ, ట్రెజరీ ద్వారా ఏజీ ఆఫీస్ నుండి ఉద్యోగుల జీపీఎఫ్, పెన్షన్లు ఆమోదించబడతాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రికార్డులు కీలకమన్నారు. పెన్షన్ ప్రతిపాదనలు అన్నీ డీడీఓ కార్యాలయాల ద్వారానే వస్తాయని, దరఖాస్తులు సరైన ఫామ్‌లో, సరైన సమయానికి రావాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను వేర్వేరు కార్యాలయాలు వేర్వేరుగా అర్థం చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులను తొలగించడానికే ఈ వర్క్‌షాప్‌లు అని వివరించారు.
సానుకూల దృక్పథంతో పరిష్కారం
అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, 20 నుండి 40 ఏళ్లు సేవ చేసి రిటైర్ అయిన ఉద్యోగులను గౌరవంగా చూడాలని, వారి పెన్షన్, జీపీఎఫ్ సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలన్నారు. మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా ఇలాంటి వర్క్‌షాప్‌ల ద్వారా అక్కడికక్కడే పరిష్కారాలు చూపుతామన్నారు.
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఏజీలు ఎం. నరేష్ కుమార్, కె. శశిధర్, ఖమ్మం ట్రెజరీ డీడీ వై. శ్రీనివాస రెడ్డి, భద్రాద్రి ట్రెజరీ డీడీ జె. మీనాక్షి, ఉప కోశాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






