మండల ఎంపీఓ సాయిరాం సోమవారం ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో కృష్ణారావు అనారోగ్య కారణాలతో దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లడంతో, సాయిరాంకు ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ సాయిరాంకు పలువురు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
మండల అభివృద్ధికి కృషి చేస్తానని సాయిరాం
అనంతరం సాయిరాం మాట్లాడుతూ, మండల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చిత్తశుద్ధితో అందిస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.