రఘునాథపాలెం, 9 November
ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం, పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చింది.
ఖమ్మం జిల్లా, రఘునాధపాలెం మండలం, ( గ్రా ) పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పరికలబోడ తండాలో క్రమం తప్పకుండా బడికి గైర్హాజరవుతున్న విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్య ప్రాముఖ్యతను వివరించి, రేపటి నుండి పిల్లలను ప్రతిరోజూ బడికి పంపాలని సూచించారు.
అదేవిధంగా, స్పెషల్ ఎడ్యుకేటర్ ఎల్. కృష్ణ ఆధ్వర్యంలో (ప్రత్యేక అవసరాలు గల పిల్లలు) చిన్నారులకు వారి తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి భరోసా కల్పించారు.
గ్రామస్తుల ప్రశంసలు
ఉపాధ్యాయుల ఈ చొరవను చూసిన గ్రామ పెద్దలు, చెట్టు నీడన చర్చించుకుంటూ, మా తండాలకు వచ్చి మరీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం నిజంగా అభినందనీయులు అని ప్రశంసించారు. గురువులే ఇంత బాధ్యత తీసుకుంటుంటే, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటో ఆలోచించుకోవాలి అని గ్రామస్తులు అన్నారు.
ఈ కార్యక్రమం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.






