నిర్మల్, 11 November
ఖానాపూర్: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ ఖానాపూర్ అధ్యక్షుడు షేక్ అఖిల్ ఆధ్వర్యంలో యువకులు మౌలానా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
విద్యా ప్రాముఖ్యత
ఈ సందర్భంగా షేక్ అఖిల్ మాట్లాడుతూ, విద్య లేని జీవితం చీకటితో సమానం. మౌలానా ఆజాద్ దేశంలో విద్య కోసం చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ముందుకు సాగాలి. విద్యతోనే మన భవిష్యత్తు బాగుపడుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యా దినోత్సవాన్ని విజయవంతం చేశారు.






