ఖమ్మం, 10 November
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వెలుగుమట్ల మోడల్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. నవంబర్ నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి గడువు విధించారు.
ఖమ్మం నగరపాలక సంస్థ 15వ డివిజన్ పరిధిలోని వెలుగుమట్ల మోడల్ కాలనీలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు. నవంబర్ నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి గడువు విధించారు. మంగళవారం వెలుగుమట్ల మోడల్ కాలనీని క్షేత్రస్థాయిలో సందర్శించిన కలెక్టర్ పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ కాలనీలో మొత్తం 300 ఇళ్లకు మంజూరు ఇవ్వగా, పనుల ప్రస్తుత పరిస్థితి ఇలా ఉందని కలెక్టర్ తెలిపారు: - 22 ఇళ్లు పూర్తిగా ముగిసి ఫినిషింగ్ దశలో ఉన్నాయి - 119 ఇళ్లకు స్లాబ్ పనులు పూర్తి - 59 ఇళ్లు రూఫ్ లెవల్ లో - 98 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా, నిర్మాణ దశను బట్టి ప్రతి సోమవారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 205 ఇళ్లకు చెల్లింపులు పూర్తి కాగా, మిగిలిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేస్తామన్నారు. నిర్మాణ వేగం పెంచేందుకు 133 మంది లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు కూడా అందించామన్నారు.
కాలనీలో బస్తీ దవాఖానా, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలను వేగవంతం సూచించారు. అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని, నెలాఖరు నాటికి పూర్తి చేసి దీనిని మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, డీఈ కె.జగ్రామ్, మున్సిపల్ కార్పొరేషన్ డీఈ నవ్యజ్యోతి, ఖమ్మం అర్బన్ తహశీల్దార్ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.


