కెరమెరి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీఓ) నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సాయిరాం ను మండలంలోని 31 గ్రామ పంచాయతీల సర్పంచులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి, అభినందనలు తెలిపారు.
కెరమెరి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీఓ) నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సాయిరాం ను మండలంలోని 31 గ్రామ పంచాయతీల సర్పంచులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి, అభినందనలు తెలిపారు. సర్పంచులు మాట్లాడుతూ మండలంలో గత కొంతకాలంగా ఎంపీడీఓ లేకపోవడంతో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. నూతన అధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మండల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఎంపీడీఓ సాయిరాం మాట్లాడుతూ మండలంలోని గ్రామాల సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.








