Medchal-Malkajgiri, 12 November
తెలంగాణ ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి విచ్చేసిన బీజేవైఎం జాతీయ అధ్యక్షులు, వడోదర ఎంపీ హేమంగ్ జోషికి శంషాబాద్ విమానాశ్రయంలో బీజేవైఎం నాయకులు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి విచ్చేసిన భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ అధ్యక్షులు, వడోదర ఎంపీ హేమంగ్ జోషికి శంషాబాద్ విమానాశ్రయంలో బీజేవైఎం ప్రగతి నగర్ డివిజన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేవైఎం ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు దొడ్డ పవన్, ఉపాధ్యక్షులు వంశీ, ప్రధాన కార్యదర్శి రామరాజు, ఇతర టీమ్ సభ్యులు విమానాశ్రయానికి చేరుకుని జాతీయ అధ్యక్షుడిని సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం భారీ కాన్వాయ్, ర్యాలీతో బండ్లగూడ వరకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హేమంగ్ జోషిని శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ పర్యటనలో పలువురు బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను దొడ్డ పవన్, బీజేవైఎం ప్రగతి నగర్ టీమ్ సభ్యులు కలుసుకున్నారు. జాతీయ నాయకత్వం యువతకు అందిస్తున్న ప్రోత్సాహం, మార్గదర్శకత్వం పార్టీ బలోపేతానికి మరింత స్ఫూర్తినిస్తాయని దొడ్డ పవన్ తెలిపారు.






