ఖమ్మం, 6 November
ఖమ్మం నగరంలోని బురాన్ పురంలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన సుమారు రూ.1.75 లక్షల విలువైన దీపావళి టపాసులను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగ వెంకటసాయి కిరాణా దుకాణంలో ఈ దాడి జరిగింది.
ఖమ్మం నగరంలోని బురాన్ పురంలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన సుమారు రూ.1.75 లక్షల విలువైన దీపావళి టపాసులను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్ ఫోర్స్ సీఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నాగ వెంకటసాయి కిరాణా దుకాణంలో దాడి నిర్వహించి, టపాసులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చర్యల నిమిత్తం ఖమ్మం టూ టౌన్ పోలీసులకు అప్పగించారు.
హెచ్చరిక
అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేసినా లేదా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ప్రజలు అనుమతి పొందిన దుకాణాల్లోనే టపాసులు కొనుగోలు చేయాలని, అక్రమ నిల్వల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.











