భారత్లో వీసా దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది.
భారత్లో వీసా దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న 13 వీసా కేటగిరీలను 9కు కుదించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
వివిధ వీసా విభాగాల మధ్య ఉన్న అనవసరమైన విభజనలను తొలగించి, దరఖాస్తుదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా కొత్త విధానాన్ని రూపొందించారు.
అంతేకాకుండా వీసా దరఖాస్తు ఫారంలోని వివరాలను కూడా 70 శాతం వరకు తగ్గించనున్నట్లు సమాచారం. దీంతో విదేశాల నుంచి భారత్కు వచ్చే పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రయాణికులకు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభం కానుంది.
ఈ మార్పులు భారత వీసా వ్యవస్థను సరళీకృతం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. వీసా విభాగాల మధ్య గందరగోళానికి చెక్ పెట్టడంతో పాటు, విదేశీ ప్రయాణికులకు సరళమైన దరఖాస్తు ప్రక్రియను అందించడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యం.





