ఖమ్మం, 13 November
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను సీతారామ ప్రాజెక్టు ఆదుకుంది. గోదావరి జలాలను ఉమ్మడి జిల్లా పంట భూములకు మళ్లించేందుకు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఈ వానాకాలం సీజన్ లో రైతులకు వరంగా మారింది. బీజీ కొత్తూరు వద్ద ఉన్న మోటార్లను ఈ సీజన్ లో మొత్తం 1,604 గంటల పాటు నడిపించి, 9.088 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోశారు అధికారులు.

సముద్రంలోకి వృథాగా వెళ్తున్న గోదావరి జలాలను మూడు ఎత్తిపోతల ద్వారా తరలించి, వైరా రిజర్వాయర్ సహా రెండు జిల్లాల్లోని 143 చెరువులను నింపారు. దీంతో , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 25 వేల ఎకరాల పంటలకు జీవం పోశారు.
ఎల్ నినో కారణంగా ఉమ్మడి జిల్లాలోని 33 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ, సీతారామ జలాలతో 7 మండలాల్లో సాగునీరు, 8 మండలాల్లో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టారు.
అలాగే రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ నింపడంతో నాగార్జున సాగర్ టెయిల్ ఎండ్ భూములకు కూడా నీరందించేందుకు వీలైంది.
ఈ ప్రాజెక్టు పూర్తి అంచనా వ్యయం రూ. 19 వేల కోట్లకు పెరిగినప్పటికీ, పూర్తయితే ఉమ్మడి , మహబూబాబాద్ జిల్లాల్లో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.