ఏన్కూరు (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 04
తుఫాను ప్రభావం దృష్ట్యా జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, మండలం నుండి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసినట్లు ఎస్ఐ సంధ్య తెలిపారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో, ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని ఎస్ఐ సంధ్య విజ్ఞప్తి చేశారు.
నుండి అంజనాపురం మీదుగా ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేశామని, వాహనదారులు అటువైపు ప్రయాణించవద్దని ఆమె సూచించారు.
పెద్దవాగు ఉధృతి
అంజనాపురం సమీపంలో పెద్దవాగు పొంగి పొర్లుతుండటంతో, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యగా వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశామని ఎస్ఐ సంధ్య తెలిపారు.
ప్రయాణికులు ఈ సూచనలను పాటించాలని ఆమె కోరారు.






