ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం జిల్లా కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లో మిల్లర్లు, బియ్యం వ్యాపారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం జిల్లా కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల అధికారులతో కలిసి మిల్లర్లు, బియ్యం వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి దుకాణంలో ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే లేదా ప్రభుత్వ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ధరలకు అమ్మే వారి సరుకును స్వాధీనం చేసుకుని వేలం వేస్తామని హెచ్చరించారు.
రైతులు, వినియోగదారులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందని సూచించారు.












