ఆంధ్రప్రదేశ్‌లో 659 మండల ప్రజా పరిషత్‌లు, 28 జిల్లా ప్రజా పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మండల పరిషత్ ఎన్నికలు న, జిల్లా పరిషత్ ఎన్నికలు న జరగనున్నాయి.
రాష్ట్రంలోని 659 మండల ప్రజా పరిషత్‌లు (), 28 జిల్లా ప్రజా పరిషత్‌ల ()కు అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు న, జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు న ఎన్నికలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసులను లోగా అందించాలని అధికారులను ఆదేశించారు.
ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముందుగా కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ప్రతి మండల పరిషత్‌లో ఒకరు, ప్రతి జిల్లా పరిషత్‌లో ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయనున్నారు. మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఈ అవకాశాన్ని కల్పించారు.
ఆ తర్వాత ఎంపీటీసీ సభ్యులు తమలో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకోనున్నారు.
పార్టీ విప్ తప్పనిసరి.. చేతులెత్తి ఓటింగ్
ఈ ఎన్నికలు చేతులెత్తే పద్ధతిలో నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జారీ చేసే విప్‌ను సభ్యులు తప్పనిసరిగా పాటించాలి. పార్టీ విప్‌ను ధిక్కరించిన సభ్యులపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అయితే కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు మాత్రం పార్టీ విప్ వర్తించదు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబంధిత పరిషత్‌ల ప్రత్యేక సమావేశాలకు హాజరుకావచ్చు. అయితే ఈ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు ఉండదు.
ఇటీవలి ఎన్నికల ఫలితాలు
ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి ఆధిక్యం సాధించింది. 582 జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి 499 స్థానాలు గెలుచుకోగా, వైఎస్సార్సీపీ 76 స్థానాలు దక్కించుకుంది. ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి మొత్తం 7,799 స్థానాలను సాధించింది. వైఎస్సార్సీపీకి 1,801 స్థానాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మండల, జిల్లా పరిషత్‌ల నాయకత్వ పదవులు ఏ పార్టీకి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అధ్యక్ష, ఛైర్మన్ పదవుల ఎంపికలో పార్టీ అంతర్గత సమీకరణాలు, రిజర్వేషన్లు, విప్ కీలక పాత్ర పోషించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 659 మండల ప్రజా పరిషత్‌లు, 28 జిల్లా ప్రజా పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మండల పరిషత్ ఎన్నికలు నవంబర్ 19న, జిల్లా పరిషత్ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక తర్వాత ఈ ఎన్నికలు జరుగుతాయి.

