ప్రజా పాలనలో భాగంగా మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన , మండలంలోని కోతుల నడుమ గ్రామంలో లబ్ధిదారుల ఇళ్ల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. హుస్నాబాద్ శాసనసభ్యులు, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ వేడుకలు నిర్వహించారు. ఈ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎర్రోళ్ల చైతన్య కుమార్ మాట్లాడుతూ, ప్రజల కష్టాలు, అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
ఈ నెల 19వ తేదీన సిద్ధిపేట జిల్లా వేదికగా నిర్వహించనున్న ప్రజా పాలన విజయోత్సవ భారీ బహిరంగ సభలో, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించే నూతన పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, రెండో విడతలో మరికొంతమంది అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. చేయూత పథకం కింద ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమని చైతన్య కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











