Medchal–Malkajgiri/Ghatkesar (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 13
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ కలకలం సృష్టించాయి. ముంబై మేయర్ కార్యాలయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం జల్సాతో పాటు పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పలు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ముంబై మేయర్ కార్యాలయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరుపుతామని గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ పంపించారు.
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం జల్సాను కూడా పేల్చేస్తామని బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన కొన్ని కార్యాలయాలు, మహాలక్ష్మి స్టేడియం పేర్లు కూడా బెదిరింపు ఈ-మెయిల్లో ఉన్నట్లు సమాచారం.
ఈ బెదిరింపు ఈ-మెయిల్స్‌తో అప్రమత్తమైన ముంబై పోలీసులు, భద్రతా సంస్థలు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం.
బెదిరింపు ఈ-మెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులెవరు వాటి విశ్వసనీయత ఎంత అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

