సిద్దిపేట, 13 November
జిల్లా మద్దూరు మండలానికి చెందిన కొమ్ము సర్వేష్ (32) మెడ వెన్నెముక వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన చికిత్సకు సుమారు రూ.5 లక్షలు అవసరమని వైద్యులు అంచనా వేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2.50 లక్షల చెక్కును మంజూరు చేయించారు.
జిల్లా మద్దూరు మండలానికి చెందిన కొమ్ము ధనస్వామి కుమారుడు కొమ్ము సర్వేష్ (32) మెడ వెన్నెముక వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించగా, ఇందుకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఆపరేషన్ ఖర్చులు భరించలేని పరిస్థితిని గుర్తించిన జనగామ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, అడ్వకేట్ భూక్య రాజేష్ రాథోడ్, మద్దూరు మాజీ జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి, బండి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2,50,000 మంజూరుకు కృషి చేశారు. చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు భూక్య రాజేష్ రాథోడ్ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ, ప్రజా ప్రభుత్వం ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో హన్మతండా గ్రామ శాఖ అధ్యక్షులు జాటోత్ వినోద్, రెడ్యానాయక్ తండా గ్రామ శాఖ అధ్యక్షులు ధరావత్ తిరుపతి, దుబ్బతండా గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ జాటోత్ రాజు తదితరులు పాల్గొన్నారు.


