సత్తుపల్లి, 11 November
రైతుల వద్ద నుండి ధాన్యాన్ని మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ వ్యాపారులు, రైస్ మిల్లర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశాల మేరకు మిల్ పాయింట్ వద్ద ఈ సమీక్ష సమావేశం జరిగింది.
రైతుల వద్ద నుండి ధాన్యాన్ని మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ వ్యాపారులు, రైస్ మిల్లర్లను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశాల మేరకు, మిల్ పాయింట్ వద్ద , తల్లాడ, కల్లూరు మండలాల వ్యాపారులు, మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సన్నరకం ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,481, బోనస్ రూ. 500 కలిపి మొత్తం రూ. 2,981, దొడ్డురకం ధాన్యానికి రూ. 2,461 చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు కూడా మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.



