ఖమ్మం, 11 November
లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలను కట్టుదిట్టంగా జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలను కట్టుదిట్టంగా జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లేఔట్ కు అప్రోచ్ రోడ్డు తప్పనిసరిగా ఉండాలని, వాటర్ బాడీస్ , బఫర్ జోన్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వరాదని స్పష్టం చేశారు. లేఔట్ లో స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు తప్పనిసరి అని అన్నారు.
కమిటీ ఆమోదం పొందిన వెంటనే 3 రోజుల్లో ఆన్లైన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో 23 లేఔట్ దరఖాస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఎస్ఈ శ్రీనివాస చారి, డిటిసిపివో వసుంధర తదితరులు పాల్గొన్నారు.

