కేరమేరి (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 11
డపటూడపడఉ.ఉెపటఇచధషణపొ.పచపఉపొ.
కెరమెరి మండలం సాంగ్వి గ్రామపంచాయతీ కార్పాటగూడ గ్రామంలో మంగళవారం సంప్రదాయ దండారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, జిల్లా అధ్యక్షురాలు అత్రం సుగుణ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న నాయకులకు గ్రామ ప్రజలు, గిరిజన సంప్రదాయ కళాకారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం గ్రామంలోని ఆరాధ్య దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించి, గిరిజన సోదరులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ, దండారి ఉత్సవాలు గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. తరతరాలుగా పూర్వీకులు అందించిన ఆచారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గిరిజన గ్రామం అభివృద్ధి చెందాలన్నదే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, సాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం తన ధ్యేయమని స్పష్టం చేశారు.
గిరిజన ప్రజల సుఖదుఃఖాల్లో భాగస్వామిగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
గిరిజన సంస్కృతి పరిరక్షణే బాధ్యత, గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుజాత ఖాన్, మాజీ సర్పంచ్ జగన్నాథ, జాదవ్ ప్రకాష్, నాగేష్, తిరుపతి, బాపురావు, సుదర్శన్, దేవిదాద్, హనుమంతు, బాపురావు, దేవేందర్, ధర్ము, వినయ్ దేవర, జిదేశా, అయుబా ఖాన్, నాగేష్, శంకర్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ఆదివాసీ కళాకారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






