గ్రామ అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు, చేతల్లో చూపించాలని నిరూపిస్తున్నారు సాంగ్వి సర్పంచ్ కర్పెత విమలబాయి. కెరమెరి మండలం సాంగ్వి గ్రామపంచాయతీలో హనుమాన్ మందిరం నుంచి పెద్దవాగుకు వెళ్లే బతుకమ్మ ఘాట్ రహదారి వర్షాలకు అధ్వానంగా మారింది. ముళ్లు, గుంతలు, జారే మట్టితో ఆ దారిలో నడవాలంటేనే మహిళలు భయపడేవారు. అయినా తప్పక ప్రతిరోజూ బట్టలు ఉతకడానికి ఈ దారిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.

గ్రామ మహిళల కష్టాన్ని స్వయంగా చూసిన సర్పంచ్ విమలబాయి వెంటనే స్పందించారు. ఎవరూ చెప్పే వరకు ఆగకుండా చొరవ తీసుకుని, జేసీబీతో రహదారిని చదును చేయించి నడవడానికి సుగమం చేశారు.
ఇప్పుడు ఆ రహదారి చూస్తేనే ఆ మార్పు తెలుస్తోంది. మహిళలు నిశ్చింతగా వెళ్లి వస్తున్నారు. బతుకమ్మ ఘాట్ కు వెళ్లే దారి ఇప్పుడు సురక్షితంగా, శుభ్రంగా మారింది.
మహిళల కష్టం మా కష్టం. గ్రామంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు. అదే మా లక్ష్యం అని సర్పంచ్ విమలబాయి అన్నారు. ఆమె మాటలు గ్రామస్తుల మనసులను గెలుచుకున్నాయి.
పదవి వచ్చినప్పటి నుంచి గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సర్పంచ్ విమలబాయిని గ్రామస్తులు మనసారా అభినందిస్తున్నారు. నిజమైన ప్రజా సేవకురాలిగా ఆమెకు గ్రామంలో మంచి పేరు వచ్చింది.