ఖమ్మం, 10 November
స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ను జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. విద్య ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని విశ్వసించిన ఆయన సేవలు చిరస్మరణీయం.
విద్య ద్వారానే వ్యక్తి వికాసం, సమాజ చైతన్యం, దేశాభివృద్ధి సాధ్యమని విశ్వసించిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన చిరస్మరణీయులు.
1947 నుంచి 1958 వరకు తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన ఆయన, పేదలు, గ్రామీణ ప్రజలు, బాలికలకు నాణ్యమైన విద్య అందించాలని ఆకాంక్షించారు. 1951లో తొలి ఐఐటీ ఖరగ్పూర్, 1953లో యూజీసీ ఏర్పాటుకు కృషి చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1992లో మరణానంతరం భారతరత్న లభించింది.
ఆయన జన్మదినమైన ను జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు.

