ఖమ్మం జిల్లాలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని మాజీ ఉప సర్పంచ్ కుందే సాహెబ్ కొనియాడారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.
అధికారం చూపించడం కాదు, పాలన అంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే అసలైన నాయకత్వమని మండల నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ కుందే సాహెబ్ అన్నారు.
ఖమ్మం జిల్లా మంత్రిగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్న సమయంలోనే మన జిల్లా, మన మండలం అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పువ్వాడ అజయ్ కుమార్ చేసిన రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, సాగునీటి వసతులు, సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని, అదే స్ఫూర్తితో పాలన కొనసాగించి రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కుందే సాహెబ్ కోరారు. పదవులు శాశ్వతం కాదు, ప్రజల గుండెల్లో స్థానమే శాశ్వతమని ఆయన అన్నారు.












