పొదుపు పథకాలు, బీమా, డిజిటల్ లావాదేవీలపై గ్రామస్తులకు వివరించిన అధికారులు
మండలం బోరిలాల్ గూడలో టిజిబి కెరమెరి శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామస్తులకు బ్యాంకు పొదుపు పథకాలు, రుణ సదుపాయాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమ యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన వంటి బీమా పథకాలు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బీమా పొందాలని అధికారులు సూచించారు.
అధికారులు మాట్లాడుతూ పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక భద్రత ఉంటుందని, కేవలం రూ.436 తో 2 లక్షల జీవిత బీమా పొందవచ్చని, ప్రమాద బీమా పథకాల ద్వారా కుటుంబానికి అండగా నిలవవచ్చని వివరించారు. డిజిటల్ లావాదేవీలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.
కార్యక్రమంలో టీజీబీ ఫీల్డ్ ఆఫీసర్ వంశీ, సిఎఫ్ఎల్ కౌన్సిలర్ చంద్రశేఖర్, జంగు, గ్రామ సర్పంచ్ చవాన్ శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.



