ఖమ్మం, 4 November
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని రూ.50 వేలు డిమాండ్ చేసి వసూలు చేసినా ఇల్లు మంజూరు కాలేదని గంగారం తండా ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ దివ్యకు ఫిర్యాదు చేయడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది.

విచారణ ప్రారంభం
మంగళవారం అడిషనల్ జేడీ శిరీష, ఏపీడీ శ్రీదేవి, ఎంపీడీవో దివ్య, సర్పంచ్ సునావత్ కిరణ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలు భూక్యా రాజీ అధికారుల ఎదుట రూ.20 వేలు ఇచ్చినట్లు వెల్లడించినట్లు గ్రామస్తులు తెలిపారు.
అధికార పార్టీ అండతో వసూళ్లు
డాబా ఇల్లు ఉన్నవారికి కూడా డబ్బులు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని, అధికార పార్టీ నాయకులు తన కనుసన్నల్లో ఉన్నారని చెప్పి వసూళ్లు చేస్తున్నాడని బాధితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిక
అధికారుల నుంచి స్పందన లేకపోతే, డబ్బు ఇచ్చిన ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బాధితులు హెచ్చరించారు. ఇరు వర్గాల వాంగ్మూలాలను రికార్డు చేశామని, బాధితులు ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని అధికారులు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.