సత్తుపల్లి నియోజకవర్గంలో నిన్న కురిసిన భారీ వర్షాలు, మురుసు తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. నియోజకవర్గంలో 200 మి.మీ పైగా వర్షపాతం నమోదైంది. వరి, పత్తి పంటలు కోత దశలో నీట మునిగి దెబ్బతిన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో నిన్న కురిసిన భారీ వర్షాలు, మురుసు తుఫాను ప్రభావంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
అందిన లెక్కల ప్రకారం నియోజకవర్గంలో 200 మి.మీ పైగా వర్షపాతం నమోదైందని, రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఇదీ ఒకటిగా నిలిచిందని తెలిపారు.
ప్రస్తుతం వరి కోత దశకు వచ్చిన తరుణంలో పొలాలు నీట మునిగి పంట పూర్తిగా దెబ్బతినిందని, పొలాల్లో నడుములోతు నీరు నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎల్ నినో ప్రభావంతో సతమతమవుతున్న వరి రైతులకు ఈ తుఫాను కోలుకోలేని దెబ్బతీసిందని, పత్తి పంట కూడా కోత దశలో తడిసి దెబ్బతినిందని పేర్కొన్నారు.
వెంటనే వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సర్వే చేపట్టాలని, సత్తుపల్లిని పంట నష్ట ప్రాంతంగా ప్రకటించి ప్రతి రైతుకు నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








